Wednesday, 15 June 2016

ఆయన నామము మహోన్నతమైన నామము (కీర్తనలు 148)

దేవునిగూర్చిన వర్ణన మరియు దేవుని కార్యములు:
Psa 148:13  ... ఆయన నామము మహోన్నతమైన నామము ఆయన ప్రభావము భూమ్యాకాశములకు పైగా నున్నది.
Psa 148:14  ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి యున్నాడు. అది ఆయన భక్తులకందరికిని ఆయన చెంతజేరిన జనులగు ఇశ్రాయేలీయులకును ప్రఖ్యాతికరముగా నున్నది....

ఆత్మీయ అభ్యాసములు:
Psa 148:1  యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా, యెహోవాను స్తుతించుడి ఉన్నతస్థలముల నివాసులారా, ఆయనను స్తుతించుడి
Psa 148:2  ఆయన దూతలారా, మీరందరు ఆయనను స్తుతించుడి ఆయన సైన్యములారా, మీరందరు ఆయనను స్తుతిం చుడి
Psa 148:3  సూర్యచంద్రులారా, ఆయనను స్తుతించుడి కాంతిగల నక్షత్రములారా, మీరందరు ఆయనను స్తుతించుడి.
Psa 148:4  పరమాకాశములారా, ఆకాశముపైనున్న జలములారా, ఆయనను స్తుతించుడి.
Psa 148:5  యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను అవి యెహోవా నామమును స్తుతించును గాక
Psa 148:6  ఆయన వాటిని నిత్యస్థాయువులుగా స్థిరపరచి యున్నాడు ఆయన వాటికి కట్టడ నియమించెను ఏదియు దాని నతిక్రమింపదు.
Psa 148:7  భూమిమీదనున్న మకరములారా, అగాధజలములారా, యెహోవాను స్తుతించుడి
Psa 148:8  అగ్ని వడగండ్లారా, హిమమా, ఆవిరీ, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుపానూ,
Psa 148:9  పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షము లారా,
Psa 148:10  మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షు లారా,
Psa 148:11  భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమిమీద నున్న అధిపతులారా, సమస్త న్యాయాధి పతులారా, యెహోవాను స్తుతించుడి.
Psa 148:12  యౌవనులు కన్యలు వృద్ధులు బాలురు
Psa 148:13  అందరును యెహోవా నామమును స్తుతించుదురు గాక...
Psa 148:14  ... యెహోవాను స్తుతించుడి.



Praise to the Lord from Creation (Notes from Psalm 148)

Description and deeds of God:
13...His name alone is exalted;
His glory is above the earth and heaven.
14 And He has exalted the horn of His people,
The praise of all His saints—
Of the children of Israel,
A people near to Him.

Godly practices:
1 Praise the Lord!
Praise the Lord from the heavens;
Praise Him in the heights!
2 Praise Him, all His angels;
Praise Him, all His hosts!
3 Praise Him, sun and moon;
Praise Him, all you stars of light!
4 Praise Him, you heavens of heavens,
And you waters above the heavens!
5 Let them praise the name of the Lord,
For He commanded and they were created.
6 He also established them forever and ever;
He made a decree which shall not pass away.
7 Praise the Lord from the earth,
You great sea creatures and all the depths;
8 Fire and hail, snow and clouds;
Stormy wind, fulfilling His word;
9 Mountains and all hills;
Fruitful trees and all cedars;
10 Beasts and all cattle;
Creeping things and flying fowl;
11 Kings of the earth and all peoples;
Princes and all judges of the earth;
12 Both young men and maidens;
Old men and children.
13 Let them praise the name of the Lord...
14....Praise the Lord!





Tuesday, 14 June 2016

గుండె చెదరినవారిని ఆయన బాగుచేయువాడు (కీర్తనలు 147)

దేవునిగూర్చిన వర్ణన మరియు దేవుని కార్యములు:
Psa 147:2  యెహోవాయే యెరూషలేమును కట్టువాడు చెదరిన ఇశ్రాయేలీయులను పోగుచేయువాడు
Psa 147:3  గుండె చెదరినవారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు.
Psa 147:4  నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించియున్నాడు వాటికన్నిటికి పేరులు పెట్టుచున్నాడు.
Psa 147:5  మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తిగలవాడు ఆయన జ్ఞానమునకు మితిలేదు.
Psa 147:6  యెహోవా దీనులను లేవనెత్తువాడు భక్తిహీనులను ఆయన నేలను కూల్చును.
Psa 147:8  ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు భూమికొరకు వర్షము సిద్ధపరచువాడు పర్వతములమీద గడ్డి మొలిపించువాడు
Psa 147:9  పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారమిచ్చువాడు.
Psa 147:10  గుఱ్ఱముల బలమునందు ఆయన సంతోషించడు నరులకాలిసత్తువయందు ఆయన ఆనందించడు.
Psa 147:11  తనయందు భయభక్తులుగలవారియందు తన కృపకొరకు కనిపెట్టువారియందు యెహోవా ఆనందించువాడైయున్నాడు.
Psa 147:13  ఆయన నీ గుమ్మముల గడియలు బలపరచి యున్నాడు నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి యున్నాడు.
Psa 147:14  నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే
Psa 147:15  భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే ఆయన వాక్యము బహు వేగముగా పరుగెత్తును.
Psa 147:16  గొఱ్ఱబొచ్చువంటి హిమము కురిపించువాడు ఆయనే బూడిదవంటి మంచు కణములు చల్లువాడు ఆయనే.
Psa 147:17  ముక్కముక్కలుగా వడగండ్లు విసరువాడు ఆయనే. ఆయన పుట్టించు చలికి ఎవరు నిలువగలరు?
Psa 147:18  ఆయన ఆజ్ఞ ఇయ్యగా అవన్నియు కరిగిపోవును ఆయన తనగాలి విసరజేయగా నీళ్లు ప్రవహించును,
Psa 147:19  ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను తన కట్టడలను తన న్యాయవిధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను.
Psa 147:20  ఏ జనమునకు ఆయన ఈలాగు చేసియుండలేదు ఆయన న్యాయవిధులు వారికి తెలియకయే యున్నవి. యెహోవాను స్తుతించుడి.

ఆత్మీయ అభ్యాసములు:
Psa 147:1  యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది అది మనోహరము స్తోత్రముచేయుట ఒప్పిదము.
Psa 147:7  కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి. సితారాతో మన దేవుని కీర్తించుడి.
Psa 147:12  యెరూషలేమా, యెహోవాను కొనియాడుము సీయోనూ, నీ దేవుని కొనియాడుము.



Praise to God for His Word and Providence (Notes from Psalm 147)

Description and deeds of God:
2 The Lord builds up Jerusalem;
He gathers together the outcasts of Israel.
3 He heals the brokenhearted
And binds up their wounds.
4 He counts the number of the stars;
He calls them all by name.
5 Great is our Lord, and mighty in power;
His understanding is infinite.
6 The Lord lifts up the humble;
He casts the wicked down to the ground.
8 Who covers the heavens with clouds,
Who prepares rain for the earth,
Who makes grass to grow on the mountains.
9 He gives to the beast its food,
And to the young ravens that cry.
10 He does not delight in the strength of the horse;
He takes no pleasure in the legs of a man.
11 The Lord takes pleasure in those who fear Him,
In those who hope in His mercy.
13 For He has strengthened the bars of your gates;
He has blessed your children within you.
14 He makes peace in your borders,
And fills you with the finest wheat.
15 He sends out His command to the earth;
His word runs very swiftly.
16 He gives snow like wool;
He scatters the frost like ashes;
17 He casts out His hail like morsels;
Who can stand before His cold?
18 He sends out His word and melts them;
He causes His wind to blow, and the waters flow.
19 He declares His word to Jacob,
His statutes and His judgments to Israel.
20 He has not dealt thus with any nation;
And as for His judgments, they have not known them.
Praise the Lord!


Godly practices:

1 Praise the Lord!
For it is good to sing praises to our God;
For it is pleasant, and praise is beautiful.
7 Sing to the Lord with thanksgiving;
Sing praises on the harp to our God,
12  Praise the Lord, O Jerusalem!
Praise your God, O Zion!




Monday, 13 June 2016

ఎవడు తన దేవుడైన యెహోవామీద ఆశపెట్టు కొనునో వాడు ధన్యుడు (కీర్తనలు 146)

దేవుని కార్యములు:
Psa 146:6  ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దాని లోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడును మాట తప్పనివాడు.
Psa 146:7  బాధపరచబడువారికి ఆయన న్యాయము తీర్చును ఆకలిగొనినవారికి ఆహారము దయచేయును యెహోవా బంధింపబడినవారిని విడుదలచేయును.
Psa 146:8  యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు యెహోవా క్రుంగినవారిని లేవనెత్తువాడు యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు
Psa 146:9  యెహోవా పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రిలేనివారిని విధవరాండ్రను ఆదరించు వాడు భక్తిహీనుల మార్గమును ఆయన వంకరమార్గముగా చేయును.
Psa 146:10  యెహోవా నిరంతరము ఏలును సీయోనూ, నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును



ఆత్మీయ అభ్యాసములు:
Psa 146:1  యెహోవాను స్తుతించుడి. నా ప్రాణమా, యెహోవాను స్తుతింపుము
Psa 146:2  నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించె దను నేను బ్రతుకుకాలమంతయు నా దేవుని కీర్తించెదను
Psa 146:3  రాజులచేతనైనను నరులచేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి
Psa 146:4  వారి ప్రాణము వెడలిపోవును వారు మంటిపాలగు దురు. వారి సంకల్పములు నాడే నశించును.
Psa 146:5  ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యెహోవామీద ఆశపెట్టు కొనునో వాడు ధన్యుడు



The Happiness of Those Whose Help Is the Lord (Notes from Psalm 146)

Deeds of God:
6 Who made heaven and earth,
The sea, and all that is in them;
Who keeps truth forever,
7 Who executes justice for the oppressed,
Who gives food to the hungry.
The Lord gives freedom to the prisoners.
8 The Lord opens the eyes of the blind;
The Lord raises those who are bowed down;
The Lord loves the righteous.
9 The Lord watches over the strangers;
He relieves the fatherless and widow;
But the way of the wicked He turns upside down.
10 The Lord shall reign forever—
Your God, O Zion, to all generations.
Praise the Lord!


Godly Practices:
1 Praise the Lord!
Praise the Lord, O my soul!
2 While I live I will praise the Lord;
I will sing praises to my God while I have my being.
3 Do not put your trust in princes,
Nor in a son of man, in whom there is no help.
4 His spirit departs, he returns to his earth;
In that very day his plans perish.
5 Happy is he who has the God of Jacob for his help,
Whose hope is in the Lord his God,


Sunday, 12 June 2016

యెహోవా అందరికి ఉపకారి (కీర్తనలు 145)

దేవునిగూర్చిన వర్ణన మరియు దేవుని కార్యములు:
Psa 145:3  యెహోవా మహాత్మ్యముగలవాడు ఆయన అధికస్తోత్రము నొందదగినవాడు ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది
Psa 145:8  యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయముగలవాడు.
Psa 145:9  యెహోవా అందరికి ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యములమీద నున్నవి.
Psa 145:13  నీ రాజ్యము శాశ్వతరాజ్యము నీ రాజ్యపరిపాలన తరతరములు నిలుచును.
Psa 145:14  యెహోవా పడిపోవువారినందరిని ఉద్ధరించువాడు క్రుంగిపోయిన వారినందరిని లేవనెత్తువాడు
Psa 145:15  సర్వజీవుల కన్నులు నీవైపు చూచుచున్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారమిచ్చుదువు.
Psa 145:16  నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి పరచుచున్నావు.
Psa 145:17  యెహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు తన క్రియలన్నిటిలో కృపచూపువాడు
Psa 145:18  తనకు మొఱ్ఱపెట్టువారి కందరికి తనకు నిజముగా మొఱ్ఱపెట్టువారి కందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు.
Psa 145:19  తనయందు భయభక్తులుగలవారి కోరిక ఆయన నెర వేర్చును వారి మొఱ్ఱ ఆలకించి వారిని రక్షించును.
Psa 145:20  యెహోవా తన్ను ప్రేమించువారినందరిని కాపా డును అయితే భక్తిహీనులనందరిని ఆయన నాశనము చేయును. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును


ఆత్మీయ అభ్యాసములు:
Psa 145:1  రాజవైన నా దేవా, నిన్ను ఘనపరచెదను. నీ నామమును నిత్యము సన్నుతించెదను
Psa 145:2  అనుదినము నేను నిన్ను స్తుతించెదను నిత్యము నీ నామమును స్తుతించెదను.
Psa 145:4  ఒక తరమువారు మరియొక తరమువారియెదుట నీ క్రియలను కొనియాడుదురు నీ పరాక్రమక్రియలను తెలియజేయుదురు
Psa 145:5  మహోన్నతమైన నీ ప్రభావమహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను
Psa 145:6  నీ భీకరకార్యముల విక్రమమును మనుష్యులు వివరించె దరు నేను నీ మహాత్మ్యమును వర్ణించెదను.
Psa 145:7  నీ మహా దయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు నీ నీతినిగూర్చి వారు గానము చేసెదరు
Psa 145:10  యెహోవా, నీ క్రియలన్నియు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు.
Psa 145:11  ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై
Psa 145:12  నీ భక్తులు నీ రాజ్యప్రభావమునుగూర్చి చెప్పుకొందురు నీ శౌర్యమునుగూర్చి పలుకుదురు
Psa 145:21  శరీరులందరు ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురు గాక.