Wednesday, 27 July 2016

సామెతలు 28

నీతిమంతులు మరియు భక్తిహీనులు:
Pro 28:1  ఎవడును తరుమకుండనే దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహమువలె ధైర్యముగా నుందురు.
Pro 28:2  దేశస్థుల దోషమువలన దాని అధికారులు అనేకు లగుదురు బుద్ధిజ్ఞానములు గలవారిచేత దాని అధికారము స్థిర పరచబడును.

Pro 28:4  ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగడు చుందురు ధర్మశాస్త్రము ననుసరించువారు వారితో పోరాడు దురు.
Pro 28:5  దుష్టులు న్యాయమెట్టిదైనది గ్రహింపరు యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహిం చుదురు.
Pro 28:6  వంచకుడై ధనము సంపాదించినవానికంటె యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి.
Pro 28:10  యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును యథార్థవంతులు మేలైనదానిని స్వతంత్రించుకొం దురు.
Pro 28:11  ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని వివేకముగల దరిద్రుడు వానిని పరిశోధించును.
Pro 28:12  నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కార ణము దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగియుం దురు.
Pro 28:13  అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును.
Pro 28:14  నిత్యము భయముగలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును కఠినపరచుకొనువాడు కీడులో పడును.

Pro 28:16  వివేకములేనివాడవై జనులను అధికముగా బాధపెట్టు అధికారీ, దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును.

Pro 28:18  యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును మూర్ఖప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును.
Pro 28:19  తన పొలము సేద్యము చేసికొనువానికి కడుపునిండ న్నము దొరకును వ్యర్థమైనవాటిని అనుసరించువారికి కలుగు పేదరికము ఇంతంతకాదు.
Pro 28:20  నమ్మకమైనవానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షనొందక పోడు.
Pro 28:21  పక్షపాతము చూపుట మంచిది కాదు రొట్టెముక్కకొరకు ఒకడు దోషముచేయును.

Pro 28:23  నాలుకతో ఇచ్చకములాడు వానికంటె నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయపొం దును.

Pro 28:25  పేరాసగలవాడు కలహమును రేపును యెహోవాయందు నమ్మకముంచువాడు వర్ధిల్లును.
Pro 28:26  తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును.
Pro 28:27  బీదలకిచ్చువానికి లేమి కలుగదు కన్నులు మూసికొనువానికి బహు శాపములు కలు గును.
Pro 28:28  దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగుకొందురు వారు నశించునప్పుడు నీతిమంతులు ఎక్కువగుదురు.

భక్తిహీనులు:
Pro 28:3  బీదలను బాధించు దరిద్రుడు ఆహారవస్తువులను ఉండనియ్యక కొట్టుకొనిపోవు వానతో సమానుడు.
Pro 28:8  వడ్డిచేతను దుర్లాభముచేతను ఆస్తి పెంచుకొనువాడు దరిద్రులను కరుణించువానికొరకు దాని కూడబెట్టును.
Pro 28:9  ధర్మశాస్త్రమువినబడకుండ చెవిని తొలగించుకొనువాని ప్రార్థన హేయము.
Pro 28:15  బొబ్బరించు సింహమును తిరుగులాడు ఎలుగుబంటియు దరిద్రులైన జనుల నేలు దుష్టుడును సమానములు.
Pro 28:17  ప్రాణము తీసి దోషము కట్టుకొనినవాడు గోతికి పరుగెత్తుచున్నాడు ఎవరును అట్టివానిని ఆపకూడదు.
Pro 28:22  చెడు దృష్టిగలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు.
Pro 28:24  తన తలిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహముకాదనుకొనువాడు నశింపజేయువానికి జతకాడు.

కుమారుడు:
Pro 28:7  ఉపదేశము నంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును.


Notes from Proverbs 28

Righteous vs wicked:
1 The wicked flee when no one pursues,
But the righteous are bold as a lion.
2 Because of the transgression of a land, many are its princes;
But by a man of understanding and knowledge
Right will be prolonged.
4 Those who forsake the law praise the wicked,
But such as keep the law contend with them.
5 Evil men do not understand justice,
But those who seek the Lord understand all.
6 Better is the poor who walks in his integrity
Than one perverse in his ways, though he be rich.
10 Whoever causes the upright to go astray in an evil way,
He himself will fall into his own pit;
But the blameless will inherit good.
11 The rich man is wise in his own eyes,
But the poor who has understanding searches him out.
12 When the righteous rejoice, there is great glory;
But when the wicked arise, men hide themselves.
13 He who covers his sins will not prosper,
But whoever confesses and forsakes them will have mercy.
14 Happy is the man who is always reverent,
But he who hardens his heart will fall into calamity.
16 A ruler who lacks understanding is a great oppressor,
But he who hates covetousness will prolong his days.
18 Whoever walks blamelessly will be saved,
But he who is perverse in his ways will suddenly fall.
19 He who tills his land will have plenty of bread,
But he who follows frivolity will have poverty enough!
20 A faithful man will abound with blessings,
But he who hastens to be rich will not go unpunished.
21 To show partiality is not good,
Because for a piece of bread a man will transgress.
23 He who rebukes a man will find more favor afterward
Than he who flatters with the tongue.
25 He who is of a proud heart stirs up strife,
But he who trusts in the Lord will be prospered.
26 He who trusts in his own heart is a fool,
But whoever walks wisely will be delivered.
27 He who gives to the poor will not lack,
But he who hides his eyes will have many curses.
28 When the wicked arise, men hide themselves;
But when they perish, the righteous increase.

Wicked:
3 A poor man who oppresses the poor
Is like a driving rain which leaves no food.
8 One who increases his possessions by usury and extortion
Gathers it for him who will pity the poor.
9 One who turns away his ear from hearing the law,
Even his prayer is an abomination.
15 Like a roaring lion and a charging bear
Is a wicked ruler over poor people.
17 A man burdened with bloodshed will flee into a pit;
Let no one help him.
22 A man with an evil eye hastens after riches,
And does not consider that poverty will come upon him.
24 Whoever robs his father or his mother,
And says, “It is no transgression,”
The same is companion to a destroyer.

Son:
7 Whoever keeps the law is a discerning son,
But a companion of gluttons shames his father.




Tuesday, 26 July 2016

సామెతలు 27

రేపటి దినము:
Pro 27:1  రేపటి దినమునుగూర్చి అతిశయపడకుము ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు.

పొగడ్త:
Pro 27:2  నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును.
Pro 27:14  వేకువనే లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించువాని దీవెన వానికి శాపముగా ఎంచ బడును.

మూఢుడు:
Pro 27:3  రాయి బరువు ఇసుక భారము మూఢుని కోపము ఆ రెంటికంటె బరువు.
Pro 27:22  మూఢుని రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను వాని మూఢత వాని వదలిపోదు.

రోషము:
Pro 27:4  క్రోధము క్రూరమైనది కోపము వరదవలె పొర్లునది. రోషము ఎదుట ఎవడు నిలువగలడు?

గద్దింపులు:
Pro 27:5  లోలోపల ప్రేమించుటకంటె బహిరంగముగా గద్దించుట మేలు
Pro 27:6  మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును పగవాడు లెక్కలేని ముద్దులుపెట్టును.

 ఆకలి:
Pro 27:7  కడుపు నిండినవాడు తేనెపట్టునైనను త్రొక్కి వేయును. ఆకలిగొనినవానికి చేదువస్తువైనను తియ్యగా నుండును.

యిల్లు విడిచి తిరుగువాడు:
Pro 27:8  తన యిల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు.

స్నేహితుడు:
Pro 27:9  తైలమును అత్తరును హృదయమును సంతోషపరచు నట్లు చెలికాని హృదయములోనుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును.
Pro 27:10  నీ స్నేహితునినైనను నీ తండ్రి స్నేహితునైనను విడిచి పెట్టకుము నీకు అపద కలిగిన దినమందు నీ సహోదరుని యింటికి వెళ్లకుము దూరములోనున్న సహోదరునికంటె దగ్గరనున్న పొరుగువాడు వాసి,
Pro 27:17  ఇనుముచేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును.

జ్ఞానము:
Pro 27:11  నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృద యమును సంతోషపరచుము. అప్పుడు నన్ను నిందించువారితో నేను ధైర్యముగా మాటలాడుదును.
Pro 27:12  బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు.

పూటబడినవాడు:
Pro 27:13  ఎదుటివానికొరకు పూటబడినవాని వస్త్రము పుచ్చు కొనుము పరులకొరకు పూటబడినవానివలన కుదువపెట్టించుము.

గయ్యాళి:
Pro 27:15  ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాళియైన భార్యయు సమానము
Pro 27:16  దానిని ఆపజూచువాడు గాలిని అపజూచువాని తోను తన కుడిచేత నూనె పట్టుకొనువానితోను సమా నుడు.

తన యజమానుని మన్నించువాడు:
Pro 27:18  అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును తన యజమానుని మన్నించువాడు ఘనతనొందును.

మనస్సు:
Pro 27:19  నీటిలో ముఖమునకు ముఖము కనబడునట్లు ఒకని మనస్సునకు మరియొకని మనస్సు కనబడును.

దృష్టి:
Pro 27:20  పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తి కానే రదు ఆలాగున నరుల దృష్టి తృప్తికానేరదు.

కీర్తి:
Pro 27:21  మూసచేత వెండిని కొలిమి చేత బంగారును తాను పొందిన కీర్తిచేత నరుని పరిశోధింపవచ్చును.

శ్రద్ధ:
Pro 27:23  నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలిసికొనుము నీ మందలయందు మనస్సు ఉంచుము.
Pro 27:24  ధనము శాశ్వతము కాదు కిరీటము తరతరములు ఉండునా?
Pro 27:25  ఎండిన గడ్డి వామివేయబడెను పచ్చిక కనబడు చున్నది కొండగడ్డి యేరబడియున్నది
Pro 27:26  నీ వస్త్రములకొరకు గొఱ్ఱపిల్లలున్నవి ఒక చేని క్రయధనమునకు పొట్టేళ్లు సరిపోవును
Pro 27:27  నీ ఆహారమునకు నీ యింటివారి ఆహారమునకు నీ పనికత్తెల జీవనమునకు మేకపాలు సమృద్ధియగును. 

Notes from Proverbs 27

Tomorrow:
1 Do not boast about tomorrow,
For you do not know what a day may bring forth.

Wrong praise:
2 Let another man praise you, and not your own mouth;
A stranger, and not your own lips.
14 He who blesses his friend with a loud voice, rising early in the morning,
It will be counted a curse to him.

Fool:
3 A stone is heavy and sand is weighty,
But a fool’s wrath is heavier than both of them.
22 Though you grind a fool in a mortar with a pestle along with crushed grain,
Yet his foolishness will not depart from him.

Jealousy:
4 Wrath is cruel and anger a torrent,
But who is able to stand before jealousy?

Rebuke:
5 Open rebuke is better
Than love carefully concealed.
6 Faithful are the wounds of a friend,
But the kisses of an enemy are deceitful.

Hunger:
7 A satisfied soul loathes the honeycomb,
But to a hungry soul every bitter thing is sweet.

Wander:
8 Like a bird that wanders from its nest
Is a man who wanders from his place.

Friend:
9 Ointment and perfume delight the heart,
And the sweetness of a man’s friend gives delight by hearty counsel.
10 Do not forsake your own friend or your father’s friend,
Nor go to your brother’s house in the day of your calamity;
Better is a neighbor nearby than a brother far away.
17 As iron sharpens iron,
So a man sharpens the countenance of his friend.

Wise:
11 My son, be wise, and make my heart glad,
That I may answer him who reproaches me.
12 A prudent man foresees evil and hides himself;
The simple pass on and are punished.

Surety:
13 Take the garment of him who is surety for a stranger,
And hold it in pledge when he is surety for a seductress.

Contentious woman:
15 A continual dripping on a very rainy day
And a contentious woman are alike;
16 Whoever restrains her restrains the wind,
And grasps oil with his right hand.

Wait on master:
18 Whoever keeps the fig tree will eat its fruit;
So he who waits on his master will be honored.

Heart:
19 As in water face reflects face,
So a man’s heart reveals the man.

Eyes:
20 Hell and Destruction are never full;
So the eyes of man are never satisfied.

Value of a person:
21 The refining pot is for silver and the furnace for gold,
And a man is valued by what others say of him.

Diligence:
23 Be diligent to know the state of your flocks,
And attend to your herds;
24 For riches are not forever,
Nor does a crown endure to all generations.
25 When the hay is removed, and the tender grass shows itself,
And the herbs of the mountains are gathered in,
26 The lambs will provide your clothing,
And the goats the price of a field;
27 You shall have enough goats’ milk for your food,
For the food of your household,
And the nourishment of your maidservants.

Friday, 22 July 2016

సామెతలు 24

దుర్జనులు:
Pro 24:1  దుర్జనులను చూచి మత్సరపడకుము వారి సహవాసము కోరకుము
Pro 24:2  వారి హృదయము బలాత్కారము చేయ యోచించును వారి పెదవులు కీడునుగూర్చి మాటలాడును.
Pro 24:7  మూర్ఖునికి జ్ఞానము అందదు గుమ్మమునొద్ద అట్టివారు మౌనులై యుందురు.
Pro 24:8  కీడుచేయ పన్నాగములు పన్నువానికి తంటాలమారి అని పేరు పెట్టబడును.
Pro 24:9  మూర్ఖుని యోచన పాపము అపహాసకులు నరులకు హేయులు.

జ్ఞానముగలవాడు:
Pro 24:3  జ్ఞానమువలన ఇల్లు కట్టబడును వివేచనవలన అది స్థిరపరచబడును. 
Pro 24:4  తెలివిచేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. 
Pro 24:5  జ్ఞానముగలవాడు బలవంతుడుగా నుండును తెలివిగలవాడు శక్తిమంతుడుగా నుండును. 
Pro 24:6  వివేకముగల నాయకుడవై యుద్ధముచేయుము. ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము 

సూచనలు:
Pro 24:10  శ్రమదినమున నీవు క్రుంగినయెడల నీవు చేతకాని వాడవగుదువు. 
Pro 24:11  చావునకై పట్టబడినవారిని నీవు తప్పించుము నాశమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? 
Pro 24:12  ఈ సంగతి మాకు తెలియదని నీవనుకొనినయెడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహిం చును గదా. నిన్ను కనిపెట్టువాడు దాని నెరుగును గదా నరులకు వారి వారి పనులనుబట్టి ఆయన ప్రతికారము చేయును గదా. 
Pro 24:13  నా కుమారుడా, తేనె త్రాగుము అది రుచిగలది గదా తేనెపట్టు తినుము అది నీ నాలుకకు తీపియే గదా. 
Pro 24:14  నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలిసికొనుము అది నీకు దొరికినయెడల ముందుకు నీకు మంచిగతి కలుగును నీ ఆశ భంగము కానేరదు. 
Pro 24:17  నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము వాడు తొట్రిల్లినప్పుడు నీవు మనస్సున నుల్లసింపకుము. 
Pro 24:18  యెహోవా అది చూచి అసహ్యించుకొని వానిమీదనుండి తన కోపము త్రిప్పుకొనునేమో. 
Pro 24:19  దుర్మార్గులను చూచి నీవు వ్యసనపడకుము భక్తిహీనులయెడల మత్సరపడకుము. 
Pro 24:20  దుర్జనునికి ముందు గతి లేదు భక్తిహీనుల దీపము ఆరి పోవును 
Pro 24:21  నా కుమారుడా, యెహోవాను ఘనపరచుము రాజును ఘనపరచుము ఆలాగు చేయనివారి జోలికి పోకుము. 
Pro 24:22  అట్టివారికి ఆపద హఠాత్తుగా తటస్థించును వారి కాలము ఎప్పుడు ముగియునో యెవరికి తెలియును? 
Pro 24:23  ఇవియు జ్ఞానులు చెప్పిన సామెతలే న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు 
Pro 24:24  నీయందు దోషములేదని దుష్టునితో చెప్పువానిని ప్రజలు శపించుదురు జనులు అట్టివానియందు అసహ్యపడుదురు. 
Pro 24:25  న్యాయముగా తీర్పు తీర్చువారికి మేలు కలుగును క్షేమకరమైన దీవెన అట్టివారిమీదికి వచ్చును. 
Pro 24:26  సరియైన మాటలతో ప్రత్యుత్తరమిచ్చుట పెదవులతో ముద్దుపెట్టుకొనినట్లుండును. 
Pro 24:27  బయట నీ పని చక్క పెట్టుకొనుము ముందుగా పొల ములో దాని సిద్ధపరచుము తరువాత ఇల్లు కట్టుకొనవచ్చును. 
Pro 24:28  నిర్నిమిత్తముగా నీ పొరుగువానిమీద సాక్ష్యము పలుక కుము నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా? 
Pro 24:29  వాడు నాకు చేసినట్లు వానికి చేసెదను వాని క్రియచొప్పున వానికి ప్రతిఫలమిచ్చెద నను కొనకుము. 

నీతిమంతుడు  మరియు భక్తిహీనుడు:
Pro 24:15  భక్తిహీనుడా, నీతిమంతుని నివాసమునొద్ద పొంచి యుండకుము వాని విశ్రమస్థలమును పాడుచేయకుము. 
Pro 24:16  నీతిమంతుడు ఏడుమారులు పడినను తిరిగి లేచును ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. 

 సోమరి:
Pro 24:30  సోమరివాని చేను నేను దాటి రాగా తెలివిలేనివాని ద్రాక్షతోట నేను దాటి రాగా 
Pro 24:31  ఇదిగో దానియందంతట ముండ్ల తుప్పలు బలిసి యుండెను. దూలగొండ్లు దాని కప్పియుండెను దాని రాతి గోడ పడియుండెను. 
Pro 24:32  నేను దాని చూచి యోచన చేసికొంటిని దాని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని. 
Pro 24:33  ఇంక కొంచెము నిద్ర యింక కొంచెము కునుకుపాటు పరుండుటకై యింక కొంచెము చేతులు ముడుచు కొనుట 
Pro 24:34  వీటివలన నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును ఆయుధస్థుడు వచ్చినట్లు లేమి నీమీదికి వచ్చును.



Notes from Proverbs 24

Wicked/fool:
1 Do not be envious of evil men,
Nor desire to be with them;
2 For their heart devises violence,
And their lips talk of troublemaking.
7 Wisdom is too lofty for a fool;
He does not open his mouth in the gate.
8 He who plots to do evil
Will be called a schemer.
9 The devising of foolishness is sin,
And the scoffer is an abomination to men.

Wise:
3 Through wisdom a house is built,
And by understanding it is established;
4 By knowledge the rooms are filled
With all precious and pleasant riches.
5 A wise man is strong,
Yes, a man of knowledge increases strength;
6 For by wise counsel you will wage your own war,
And in a multitude of counselors there is safety.

Faint:
10 If you faint in the day of adversity,
Your strength is small.

Instructions:
11 Deliver those who are drawn toward death,
And hold back those stumbling to the slaughter.
12 If you say, “Surely we did not know this,”
Does not He who weighs the hearts consider it?
He who keeps your soul, does He not know it?
And will He not render to each man according to his deeds?
13 My son, eat honey because it is good,
And the honeycomb which is sweet to your taste;
14 So shall the knowledge of wisdom be to your soul;
If you have found it, there is a prospect,
And your hope will not be cut off.
17 Do not rejoice when your enemy falls,
And do not let your heart be glad when he stumbles;
18 Lest the Lord see it, and it displease Him,
And He turn away His wrath from him.
19 Do not fret because of evildoers,
Nor be envious of the wicked;
20 For there will be no prospect for the evil man;
The lamp of the wicked will be put out.
21 My son, fear the Lord and the king;
Do not associate with those given to change;
22 For their calamity will rise suddenly,
And who knows the ruin those two can bring?
23 These things also belong to the wise:
It is not good to show partiality in judgment.
24 He who says to the wicked, “You are righteous,”
Him the people will curse;
Nations will abhor him.
25 But those who rebuke the wicked will have delight,
And a good blessing will come upon them.
26 He who gives a right answer kisses the lips.
27 Prepare your outside work,
Make it fit for yourself in the field;
And afterward build your house.
28 Do not be a witness against your neighbor without cause,
For would you deceive[a] with your lips?
29 Do not say, “I will do to him just as he has done to me;
I will render to the man according to his work.”

Righteous vs Wicked:
15 Do not lie in wait, O wicked man, against the dwelling of the righteous;
Do not plunder his resting place;
16 For a righteous man may fall seven times
And rise again,
But the wicked shall fall by calamity.

Lazy:
30 I went by the field of the lazy man,
And by the vineyard of the man devoid of understanding;
31 And there it was, all overgrown with thorns;
Its surface was covered with nettles;
Its stone wall was broken down.
32 When I saw it, I considered it well;
I looked on it and received instruction:
33 A little sleep, a little slumber,
A little folding of the hands to rest;
34 So shall your poverty come like a prowler,
And your need like an armed man.



Thursday, 21 July 2016

సామెతలు 23

ఏలికతో భోజనము:
Pro 23:1  నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండినయెడల నీవెవరి సమక్షమున నున్నావో బాగుగా యోచిం చుము.
Pro 23:2  నీవు తిండిపోతువైనయెడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము.
Pro 23:3  అతని రుచిగల పదార్థములను ఆశింపకుము అవి మోసపుచ్చు ఆహారములు.

ఐశ్వర్యము:
Pro 23:4  ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాని విడిచిపెట్టుము.
Pro 23:5  నీవు దానిమీద దృష్టి నిలిపినతోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి యెగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరి పోవును.

ఎదుటివాని మేలు ఓర్చలేనివాడు:
Pro 23:6  ఎదుటివాని మేలు ఓర్చలేనివానితో కలిసి భోజనము చేయకుము వాని రుచిగల పదార్థముల నాశింపకుము.
Pro 23:7  అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొను వాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములోనుండి వచ్చు మాట కాదు.
Pro 23:8  నీవు తినినను తినినదానిని కక్కి వేయుదువు నీవు పలికిన యింపైన మాటలు వ్యర్థములగును.

బుద్ధిహీనుడు:
Pro 23:9  బుద్ధిహీనుడు వినగా మాటలాడకుము అట్టివాడు నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించును.

దేవుడు:
Pro 23:10  పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము తలిదండ్రులు లేనివారి పొలములోనికి నీవు చొరబడ కూడదు
Pro 23:11  వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారిపక్షమున నీతో వ్యాజ్యెమాడును.

సూచనలు:
Pro 23:12  ఉపదేశముమీద మనస్సు నుంచుము తెలివిగల మాటలకు చెవి యొగ్గుము.
Pro 23:15  నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన యెడల నా హృదయముకూడ సంతోషించును.
Pro 23:16  నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును.
Pro 23:17  పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము నిత్యము యెహోవాయందు భయభక్తులు కలిగి యుండుము.
Pro 23:18  నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును నీ ఆశ భంగము కానేరదు.
Pro 23:19  నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకొనుము.

Pro 23:22  నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము.
Pro 23:23  సత్యమును అమ్మివేయక దాని కొనియుంచు కొనుము జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొనియుంచు కొనుము.

Pro 23:26  నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము,

బాలురు:
Pro 23:13  నీ బాలురను శిక్షించుట మానుకొనకుము బెత్తముతో వాని కొట్టినయెడల వాడు చావకుండును
Pro 23:14  బెత్తముతో వాని కొట్టినయెడల పాతాళమునకు పోకుండ వాని ఆత్మను నీవు తప్పించె దవు.
Pro 23:24  నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును జ్ఞానముగలవానిని కనినవాడు వానివలన ఆనందము నొందును.
Pro 23:25  నీ తలిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను.


త్రాగుబోతులు తిండిపోతులు:
Pro 23:20  ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగాతినువారితోనైనను సహ వాసము చేయకుము.
Pro 23:21  త్రాగుబోతులును తిండిపోతులును దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును. .
Pro 23:29  ఎవరికి శ్రమ? ఎవరికి దుఃఖము? ఎవరికి జగడములు? ఎవరికి చింత? ఎవరికి హేతువులేని గాయములు?ఎవరికి మంద దృష్టి?
Pro 23:30  ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చువారికే గదా కలిపిన ద్రాక్షారసము రుచిచూడ చేరువారికే గదా.
Pro 23:31  ద్రాక్షారసము మిక్కిలి ఎఱ్ఱబడగను గిన్నెలో తళతళలాడుచుండగను త్రాగుటకు రుచిగా నుండగను దానివైపు చూడకుము.
Pro 23:32  పిమ్మట అది సర్పమువలె కరచును కట్లపామువలె కాటువేయును.
Pro 23:33  విపరీతమైనవి నీ కన్నులకు కనబడును నీవు వెఱ్ఱిమాటలు పలుకుదువు
Pro 23:34  నీవు నడిసముద్రమున పండుకొనువానివలె నుందువు ఓడకొయ్య చివరను పండుకొనువానివలె నుందువు.
Pro 23:35  నన్ను కొట్టినను నాకు నొప్పి కలుగలేదు నామీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు నేనెప్పుడు నిద్ర మేల్కొందును? మరల దాని వెదకుదును అని నీవనుకొందువు.

వేశ్య:
Pro 23:27  వేశ్య లోతైన గొయ్యి పరస్త్రీ యిరుకైన గుంట.
Pro 23:28  దోచుకొనువాడు పొంచియుండునట్లు అది పొంచి యుండును అది బహుమందిని విశ్వాసఘాతకులనుగా చేయును