Wednesday 16 March 2016

న్యాయముకొరకైన విజ్ఞప్తి (కీర్తనలు 82 నుండి ధ్యానము)

 పేదలకును తలిదండ్రులులేనివారికిని న్యాయము తీర్చుడి
శ్రమగలవారికిని దీనులకును న్యాయము తీర్చుడి. 
 దరిద్రులను నిరుపేదలను విడిపించుడి భక్తిహీనుల చేతిలోనుండి వారిని తప్పించుడి.
 జనులకు తెలివి లేదు వారు గ్రహింపరు వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు
దేశమునకున్న ఆధారములన్నియు కదలుచున్నవి.
 మీరు దైవములనియు మీరందరు సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చియున్నాను. (కీర్తనలు 82:3-6) 


దేవుడు ప్రేమ, కృప, దయ చూపుటయందు ఐశ్వర్యవంతుడు (2 కొరిం 8:9). ఆయన అందరికి తండ్రియైయున్నాడు.(ఎఫెస్సీ 4:6).  ఆయన మహా వివేకి, అధిక బలసంపన్నుడు (యోబు 9:4).

దేవునినుండి దూరముగా ఉన్నప్రతివారు ఆత్మీయముగా దరిద్రులు (పేదవారు), దిక్కులేనివారు, శ్రమగలవారు అని పరిశుద్ద గ్రంధము సెలవిచ్చుచున్నది.
వారు తెలివి,గ్రహింపులేనివారు, అవివేకములో నడచువారు, అస్థిరులు.

యేసు క్రీస్తు ప్రభువు రక్తము మనలను నీతిమంతులుగా తీర్చును, దుష్టునినుండి విడిపించును, నరకమునుండి తప్పించును.

దినదినము క్రీస్తు స్వరూపములొనికి మార్చబడుచున్న సర్వోన్నతుని కుమారులమైన మనము, నశించుచున్నవారికి సువార్త అందించుటద్వారా మరియు వారికొరకు విజ్ఞాపన చేయుటద్వారా దేవునియొక్క ఆశను నెరవేర్చగలము.    


-  డేవిడ్ నల్లపు (సువార్తికులు, అగాపే మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్)

No comments:

Post a Comment