Thursday, 17 March 2016

దేవుని శత్రువులకు కలుగు దుర్గతి (కీర్తనలు 83 నుండి ధ్యానము)

శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది;అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు.   కాగా శరీరస్వభావముగల వారు దేవుని సంతోషపరచనేరరు. (రోమా 8:7,8)

వ్యభిచారుణులారా, యీ లోకస్నేహము దేవునితో వైరమని మీ రెరుగరా? కాబట్టి యెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. (యాకోబు 4:4)

దేవుని శత్రువులకు కలుగు దుర్గతి గురించి కీర్తనలు 83లో స్పష్ఠముగా వ్రాయబడియున్నది.

అట్టివారు నశించి, భూమికి పెంట అగుదురు. సుడి తిరుగు ధూళివలెను గాలి యెదుటి వగుడాకులవలెను  దేవుడు వారిని చేయును.  అగ్ని అడవిని కాల్చునట్లు కారుచిచ్చు కొండలను తగుల పెట్టునట్లు దేవుడు  తుపానుచేత వారిని తరుమును,  తన సుడిగాలిచేత వారికి భీతి పుట్టించును. వారికి పూర్ణావమానము కలుగజేయును.
వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురు. వారు భ్రమసి నశించుదురు. (:14-17)

 ఇందుకు వాస్తవ ఉదాహరణలుగా మిద్యాను, సీసెరా, యాబీను, ఓరేబు, జెయేబు, జెబహు, సల్మున్నాఅనువారు ఉన్నరు. (:9-11)

అయితే యేసుక్రీస్తు ప్రభువువారు కలువరి సిలువపై కార్చిన పరిశుద్ధ రక్తమువలన దేవుని ప్రజలుగా ఉన్నవారికి, దేవుడు ఆశ్రయముగా ఉండును. యెహోవా అను నామము ధరించిన ఆయన మాత్రమే సర్వలోకములో  మహోన్నతుడు. ఆయనకు నిరంతరము స్తొత్రములుకలుగును గాక!


  ---  డేవిడ్ నల్లపు  (సువార్తికులు, అగాపే మినిస్ట్రీస్ - ఇంటర్నేష్నల్)




No comments:

Post a Comment