Friday 25 March 2016

కోల్పోయిన ఆశీర్వాదములు (కీర్తనలు 89 నుండి ధ్యానము)

దేవుని గూర్చిన వర్ణన:
  కృపాతిశయము, విశ్వాస్యతగల దేవుడు, ఆశ్చర్యకార్యములుచేయు దేవుడు, అసమానుడు, భీకరుడు, భయంకరుడు (పూజుంపదగిన దేవుడు),  సృష్ఠికర్త, పరాక్రమవంతుడు, బలవంతుడు, నీతిన్యాయములు, కృపాసత్యములుగల దేవుడు, పరిశుద్ధ దేవుడు, తండ్రి, రక్షణ దుర్గము (:1, 5-8, 11-14, 18,26)


సువార్తను నమ్మువారికి కలుగు ధన్యతలు:
      -  దేవుని ముఖకాంతిని చూచి వారు నడుచుకొందురు.
      -  దేవుని నామమునుబట్టి వారు దినమెల్ల హర్షించుచుందురు. .
      -   దేవుని నీతిచేత హెచ్చింపబడుచుందురు
      -  వారి బలమునకు అతిశయాస్పదము దేవుడే
     -  దేవుని దయ వారిపై ఉండును
     -   దేవుడు వారిని భద్రపరచును (:15-18)

దేవుడు తన ప్రజలతో వ్యవహరించు విధము:
   
     సహాయముచేయును,  హెచ్చించును, అభిషేకించును, బలపరచును, శత్రువుల నుండి కాపాడును, తన విశ్వాస్యతయు,కృపయు, నిబంధనవారికి తోడై యుండును, క్రమపరచును. (:19-24,28,32)

దేవుని ప్రజలు దేవునికి దూరమైతే ... :
           విసర్జింపబదురు, దేవుని కోపమునకు గురియగుదురు, దేవుని కాపుదలను కోల్పొవుదురు, నిందపాలగుదురు, ఆయుష్కాలము తగ్గింపబడి, సిగ్గుతో కప్పబడుదురు. (:38-45)

ఒక మంచి ప్రశ్న :
   మరణమును చూడక బ్రదుకు నరుడెవడు? పాతాళముయొక్క వశము కాకుండ తన్నుతాను తప్పించుకొనగలవాడెవడు?  (:48)

యేసు క్రీస్తు ప్రభుని పరిశుద్ధరక్తమునందు కడుగబడి ఆయనను వ్యక్తిగత రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించిన వ్యక్తి, రెండవమరణమును చూడక యేసు క్రీస్తు ప్రభువునందున్న పునరుత్థానశక్తివలన, పాతాళవశమునుండి తప్పింపబడి,నిత్యజీవములో ప్రవేశించును.
-   డేవిడ్ నల్లపు (సువార్తికులు, మిషనరీ - అగాపే మినిస్ట్రీస్ ఇంటర్నేష్నల్) 
    




No comments:

Post a Comment