Saturday 26 March 2016

నిత్యుడైన దేవుడు - అల్పుడైన మానవుడు (కీర్తన 90 నుండి ధ్యానము)

ఈ కీర్తనలొ దేవుని ప్రత్యక్షత :
        -  తరతరములనుండి తన ప్రజలకు నివాసస్ఠలము (:1)
        - నిత్యుడగు దేవుడు(:2)
        -  సర్వశక్తిగల దేవుడు(:3)
        -  కనికరము, కృపగల దేవుడు (:13,14)
        -  ప్రభావముగల దేవుడు (:16)

మానవుడు గడ్డితో పోల్చబడుట:
       ప్రొద్దున వారు పచ్చ గడ్డివలె చిగిరింతురు . ప్రొద్దున అది మొలిచి చిగిరించును సాయంకాలమున అది కోయబడి వాడబారును.  (:5,6)



"మా దోషములను నీవు నీ యెదుట నుంచుకొని యున్నావు నీ ముఖకాంతిలో మా రహస్యపాపములు కనబడు చున్నవి. " అని భక్తుడైన మోషే పలుకుచున్నడు.

ప్రార్థన:
          -   మాకు జ్ఞానహృదయము కలుగునట్లుగా చేయుము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము.
          -    యెహోవా, తిరుగుము ఎంతవరకు తిరుగకయుందువు? నీ సేవకులను చూచి సంతాపపడుము.
          -   ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము అప్పుడు మేము మా దినములన్నియు ఉత్సహించి సంతోషించెదము.
          -   నీవు మమ్మును శ్రమపరచిన దినముల కొలది మేము కీడనుభవించిన యేండ్లకొలది మమ్మును సంతోష పరచుము.
          -  నీ సేవకులకు నీ కార్యము కనుపరచుము వారి కుమారులకు నీ ప్రభావము చూపింపుము.
         -  మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక
          -  మా చేతిపనిని మాకు స్థిరపరచుము మా చేతిపనిని స్థిరపరచుము.  (:12-17)






No comments:

Post a Comment