Monday, 28 March 2016

ఆశీర్వాదపు ఝల్లులు (కీర్తనలు 91 నుండి ధ్యానము)

దేవునిగూర్చిన వర్ణన :
మహొన్నతుడు, సర్వశక్తుడు, ఆశ్రయము, కోట, సత్యవంతుడు, ఉత్తరమిచ్చుదేవుడు, రక్షించు దేవుడు  (: 1,2. 4, 15,16)

దేవుని నుండి ఆశీర్వాదములు:
    -  వేటకాని ఉరిలోనుండి ఆయన నిన్ను విడిపించును
   -   నాశనకరమైన తెగులు రాకుండ నిన్ను రక్షించును 
   -  ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును 
   -  ఆయన సత్యము, కేడెమును డాలునై యున్నది. 
   -  రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను  చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. 
   -  నీ ప్రక్కను వేయి మంది పడినను నీ కుడిప్రక్కను పదివేల మంది కూలినను అపాయము నీ యొద్దకురాదు. 
   -   నీకు అపాయమేమియు రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు 
   -   నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును 
   -    నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు కొదమ సింహములను భుజంగములను అణగ ద్రొక్కె దవు. 
  -     నేనతని తప్పించెదను, ... నేనతని ఘనపరచెదను 
  -    అతడు నాకు మొఱ్ఱపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చె దను శ్రమలో నేనతనికి తోడై యుండెదను అతని విడిపించి అతని గొప్ప చేసెదను 
   -  దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను నా రక్షణ అతనికి చూపించెదను. (:1-16)

ఆత్మీయ అభ్యాసములు :
    -  దేవునియందు విశ్వాసముకలిగియుండుట
    -  ఆయనను ఆశ్రయముగా, కోటగాకలిగియుండుట
    -  దేవుని ప్రేమించుట
    -  ఆయన నామమును యెరిగియుండుట
    -  ఆయనకు మొఱ్ఱపెట్టుట  (:2, 9, 14, 15)



   -    డేవిడ్ నల్లపు (సువార్తికులు, మిషనరీ - అగాపే మినిస్ట్రీస్ ఇంటర్నేష్నల్)




No comments:

Post a Comment