Tuesday, 12 April 2016

యెహోవా నన్ను జ్ఞాపక మునకు తెచ్చుకొనుము (కీర్తనలు 106:1-23 నుండి ధ్యానము)

దేవుని గూర్చిన వర్ణన:
             యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. (:1) రక్షకుడైన దేవుడు (:22)
దేవుని క్రియలు:
            అయినను తన మహా పరాక్రమమును ప్రసిద్ధి చేయు టకై ఆయన తన నామమునుబట్టి వారిని రక్షించెను.
           ఆయన ఎఱ్ఱసముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను
           మైదానముమీద నడుచునట్లు వారిని అగాధజలము లలో నడిపించెను.
          వారి పగవారి చేతిలోనుండి వారిని రక్షించెను
          శత్రువుల చేతిలోనుండి వారిని విమోచించెను. (:8-10)
          వారు కోరినది ఆయన వారికిచ్చెను అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగ జేసెను.  (:15)
          ఐగుప్తులో గొప్ప కార్యములను హాముదేశములో ఆశ్చర్యకార్యములను
       ఎఱ్ఱసముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుడు (:21,22

)

ఇశ్రాయేలు ప్రజల వైఫల్యాలు:

             మా పితరులవలెనే మేము పాపము చేసితిమి దోషములు కట్టుకొని భక్తిహీనులమైతిమి
             ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపక యుండిరి
             నీ కృపాబాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనక యుండిరి
             సముద్రమునొద్ద ఎఱ్ఱసముద్రమునొద్ద వారు తిరుగు బాటు చేసిరి.  (:6,7)
              అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచి పోయిరి
              ఆయన ఆలోచనకొరకు కనిపెట్టుకొనకపోయిరి.
             అరణ్యములో వారు బహుగా ఆశించిరి ఎడారిలో దేవుని శోధించిరి  (:13,14)
             వారు తమ దండు పాళెములో మోషేయందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోనునందును అసూయపడిరి (16)
           
              హోరేబులో వారు దూడను చేయించుకొనిరి. పోతపోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి
             తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపము నకు మార్చిరి.
            ఐగుప్తులో గొప్ప కార్యములను హాముదేశములో ఆశ్చర్యకార్యములను  ఎఱ్ఱసముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి. (:19-22)
           
ఆత్మీయ అభ్యాసములు:   
            యెహోవాను స్తుతించుడి యెహోవా దయాళుడు
            ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును.
           యెహోవా పరాక్రమకార్యములను ఎవడు వర్ణింప గలడు?
           ఆయన కీర్తి యంతటిని ఎవడు ప్రకటింపగలడు?
           న్యాయము ననుసరించువారు ఎల్లవేళల నీతి ననుసరించి నడుచుకొనువారు ధన్యులు. (:1-3)
          అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను  (:23)
     
ప్రార్థన:
               యెహోవా, నీవు ఏర్పరచుకొనినవారి క్షేమము నేను చూచుచు 
                నీ జనులకు కలుగు సంతోషమునుబట్టి నేను సంతో షించుచు 
               నీ స్వాస్థ్యమైనవారితో కూడి కొనియాడునట్లు 
               నీ ప్రజలయందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపక మునకు తెచ్చుకొనుము 
              నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. (4,5)




       



    

No comments:

Post a Comment