Wednesday, 13 April 2016

దేవుని కృపాబాహుళ్యము (కీర్తనలు 106:24-48 నుండి ధ్యానము)

దేవుని క్రియలు:
           అప్పుడు అరణ్యములో వారిని కూలచేయుటకును అన్యజనులలో వారి సంతానమును కూల్చుటకును దేశములో వారిని చెదరగొట్టుటకునుఆయన వారిమీద చెయ్యి యెత్తెను. (:26,27)
          యెహోవా కోపము ఆయన ప్రజలమీద రగులుకొనెను ఆయన తనస్వాస్థ్యమందు అసహ్యపడెను.
          ఆయన వారిని అన్యజనులచేతికి అప్పగించెను వారి పగవారు వారిని ఏలుచుండిరి. (:40,41)
           అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను (:43)
            అయినను వారిరోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను.
             వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసికొనెను తన కృపాబాహుళ్యమునుబట్టి వారిని కరుణించెను.
             వారిని చెరగొనిపోయిన వారికందరికి వారియెడల కనికరము పుట్టించెను. (:44-46)
 
ఇశ్రాయేలు ప్రజల వైఫల్యాలు:
               వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి ఆయన మాట నమ్మకపోయిరి
              యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సణుగుకొనిరి. (:24,25)
               వారు బయల్పెయోరును హత్తుకొని, చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును భుజించిరి.
              వారు తమ క్రియలచేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను. (:28,29)
\               మెరీబా జలములయొద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను.
              ఎట్లనగా వారు అతని ఆత్మమీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కానిమాట పలికెను.
              యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయకపోయిరి.
               అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి.
               వారి విగ్రహములకు పూజచేసిరి అవి వారికి ఉరి ఆయెను.
                మరియు వారు తమ కూమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి.
               నిరపరాధ రక్తము, అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఒలికించిరి కనానుదేశపువారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి ఆ రక్తమువలన దేశము అపవిత్రమాయెను
              తమ క్రియలవలన వారు అపవిత్రులైరి తమ నడవడిలో వ్యభిచరించినవారైరి. (:32-39)

ప్రార్థన:
    యెహోవా మాదేవా, మమ్మును రక్షింపుము మేము నీ పరిశుద్ధనామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లును నిన్నుస్తుతించుచు మేమతిశయించునట్లును అన్యజనులలోనుండి మమ్మును పోగుచేయుము. (:47)



ఫీనెహాసు ఒక మంచి మాదిరి:
           వారు తమ క్రియలచేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను. 
           ఫీనెహాసు లేచి పరిహారముచేయగా ఆ తెగులు ఆగిపోయెను. 
          నిత్యము తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచ బడెను. (:29-31)


No comments:

Post a Comment