Saturday 16 April 2016

ప్రార్ధన, స్తుతి, కృతజ్ఞత (కీర్తనలు 109 నుండి ధ్యానము)

 కపటము,  అబద్ధములు, ద్వేషపు మాటలు, పగ మధ్య ఉన్న విశ్వాసి చేయవలసినవి:

నా స్తుతికి కారణభూతుడవగు దేవా, మౌనముగా ఉండకుము
 నన్ను చెరపవలెనని భక్తిహీనులు తమ నోరు కపటముగల తమ నోరు తెరచియున్నారు
 వారు నామీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు.
 నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలాడు చున్నారు నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు
  నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నామీద పగ పట్టియున్నారు
అయితే నేను మానక ప్రార్థనచేయుచున్నాను. 
 నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నామీద ద్వేష ముంచుచున్నారు. (:1-5)

నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను 
అనేకుల మధ్యను నేనాయనను స్తుతించెదను. 
  దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపరచువారి చేతి లోనుండి అతని రక్షించుటకై యెహోవా అతని కుడిప్రక్కను నిలుచుచున్నాడు. (:30,31)



No comments:

Post a Comment