Monday 25 April 2016

యెహోవా, దయచేసి అభివృద్ధి కలిగించుము. (కీర్తనలు 118 నుండి ధ్యానము)

దేవునిగూర్చిన వర్ణన:
           యెహోవా దయాళుడు
          ఆయన కృప నిరంతరము నిలుచును (:1)
          యెహోవా నా పక్షము వహించి నాకు సహకారియై యున్నాడు (:7)
         యెహోవా నా దుర్గము నా గానము ఆయన నాకు రక్షణాధారమాయెను.  (:14)
       

దేవుని కార్యములు:
          యెహోవా దక్షిణహస్తము మహోన్నత మాయెను
           యెహోవా దక్షిణహస్తము సాహసకార్యములను చేయును. (:16)
           ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను.
          అది యెహోవావలన కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యము  (:22, 23)
           యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు నను గ్రహించియున్నాడు (:27)
   
ఆత్మీయ అభ్యాసములు:
                     ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి
                    ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు, అహరోను వంశ స్థులు     యెహోవా యందు భయభక్తులుగలవారు అందురు గాక. (:1-4)
                      మనుష్యులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు.
                     రాజులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు (:8,9).
                    నీతిమంతుల గుడారములలోరక్షణనుగూర్చిన ఉత్సాహ సునాదము వినబడును (:15)
                  నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చి యున్నావు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. (:21)
                   ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము దీనియందు మనము ఉత్సహించి సంతోషించెదము. (:24)
                       నీవు నా దేవుడవు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను నీవు నా దేవుడవు నిన్ను ఘనపరచెదను. (:28)

కీర్తనాకారుని అనుభవము: 
             ఇరుకునందుండి నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని
             విశాలస్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను
            యెహోవా నా పక్షమున నున్నాడు నేను భయ పడను నరులు నాకేమి చేయగలరు?
            యెహోవా నా పక్షము వహించి నాకు సహకారియై యున్నాడు నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. (:5-7)
               అన్యజనులందరు నన్ను చుట్టుకొనియున్నారు యెహోవా నామమునుబట్టి నేను వారిని నిర్మూలము చేసెదను.
              నలుదిశలను వారు నన్ను చుట్టుకొనియున్నారు యెహోవా నామమునుబట్టి నేను వారిని నిర్మూలము చేసెదను.
               కందిరీగలవలె నామీద ముసిరి యున్నారు ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించి పోయిరి యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసెదను.
            నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి యెహోవా నాకు సహాయము చేసెను.
            యెహోవా నా దుర్గము నా గానము ఆయన నాకు రక్షణాధారమాయెను.  (:10-14)
            నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివ రించెదను.
           యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు.
           నేను వచ్చునట్లు నీతి గుమ్మములు తీయుడి నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించెదను. (:17-19)

ప్రవచనము:
                 ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను.
                   అది యెహోవావలన కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యము (:22,23)

ప్రార్ఠన:
       యెహోవా, దయచేసి నన్ను రక్షించుము యెహోవా, దయచేసి అభివృద్ధి కలిగించుము. (:25)






               

 

         



No comments:

Post a Comment