Saturday, 2 April 2016

దేవుని సన్నిధిని వణకుడి (కీర్తనలు 96 నుండి ధ్యానము)

దేవునిగూర్చిన వర్ణన :
                యెహోవా మహాత్మ్యముగలవాడు ఆయన అధికస్తోత్రము పొందతగినవాడు సమస్త దేవతలకంటెను ఆయన పూజనీయుడు.
               జనముల దేవతలందరు వట్టి విగ్రహములే యెహోవా ఆకాశవిశాలమును సృజించినవాడు.
               ఘనతాప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి బలసౌందర్యములు ఆయన పరిశుద్ధస్థలములో ఉన్నవి.  (:4-6)
                పరిశుద్ధుడు, న్యాయవంతుడు, విశ్వాస్యతగల దేవుడు (:9,13)

ఆత్మీయ అభ్యాసములు:
                  యెహోవామీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి 
                  అనుదినము ఆయన రక్షణసువార్తను ప్రకటించుడి. 
                 అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి 
                 సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములను ప్రచురించుడి  (:2,3)
                 మహిమబలములు యెహోవాకు చెల్లించుడి. 
                 యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి 
                  నైవేద్యము తీసికొని ఆయన ఆవరణములలోనికి రండి. 
                  పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారముచేయుడి 
                  సర్వభూజనులారా, ఆయన సన్నిధిని వణకుడి.  (:7-9)

ప్రభువుయొక్క రెండవ రాకడ :
                   భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయు చున్నాడు న్యాయమునుబట్టి లోకమునకు తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును.  (:13)


స్పంధన:
           యెహోవా వేంచేయుచున్నాడు ఆకాశము సంతోషించునుగాక 
           భూమి ఆనందించును గాక సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. 
           పొలమును దానియందుగల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక. 
           వనవృక్షములన్నియు ఉత్సాహధ్వని చేయునుగాక. (:11,12)


ఆయన రెండవ రాకడనుగూర్చిన వార్త నీకు సంతోషము, ఆనందము, ప్రహర్షము, ఉత్సాహము కలిగించుచున్నదా ? అలాగైతే నీవు దేవునితో సరియైన సంబంధముకలిగియున్నావనుటకు సూచన. అలాగు లేనట్లైతే ఈనాడే దేవునితో సరియైన సంబంధము కలిగియుండుటకు ఆయన సహాయముతో నీ హృదయమును సరిచేసుకొనుము.


-   డేవిడ్ నల్లపు  (సువార్తికులు, మిషనరీ - అగాపే మినిస్ట్రీస్ ఇంటర్నేష్నల్)



No comments:

Post a Comment