Sunday, 3 April 2016

దేవుని కాపుదల (కీర్తనలు 97 నుండి ధ్యానము)

దేవునిగూర్చిన వర్ణన :
           రాజులకు రాజు, నీతిమంతుడు, న్యాయవంతుడు, సర్వలోకనాధుడు, మహిమగల దేవుడు, భూలోకమంతటికి పైగా మహోన్నతుడు,  సమస్త దేవతలకు పైగా అత్యధికమైన ఔన్న త్యము పొందియున్నదేవుడు, యధార్థవంతుడు, పరిశుద్ధుడు. (:1,2,6,9,11,12)


విశ్వాసులు :
        సీయోను నివాసులు ... నీ న్యాయవిధులనుబట్టి సంతోషించుచున్నారు యూదా కుమార్తెలు ఆనందించుచున్నారు. 
     యెహోవాను ప్రేమించువారలారా, చెడుతనమును అసహ్యించుకొనుడి.
      నీతిమంతులారా, యెహోవాయందు సంతోషించుడి ఆయన పరిశుద్ధనామమునుబట్టి ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి.  (:8, 10, 12)

విగ్రహారాధన:
         వ్యర్థ విగ్రహములనుబట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించువారందరు సిగ్గుపడు దురు సకలదేవతలు ఆయనకు నమస్కారము చేయును.  (:7)

దేవుని వాగ్ధనములు:
               తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనులచేతిలోనుండి ఆయన వారిని విడిపించును. 
             నీతిమంతులకొరకు వెలుగును యథార్థహృదయులకొరకు ఆనందమును విత్తబడి యున్నవి. (:11)



No comments:

Post a Comment