Tuesday 5 April 2016

పాపము పరిహరించు దేవుడు (కీర్తనలు 99 నుండి ధ్యానము)

దేవుని గూర్చిన వర్ణన :
               రాజ్యముచేయువాడు,  మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చియున్న దేవుడు, గొప్ప నామముగల దేవుడు. పరిశుద్ధుడు,  నీతి న్యాయములను జరిగించు దేవుడు, మొఱ్ఱలకు ఉత్తరమిచ్చు దేవుడు, పాపము పరిహరించు దేవుడు.(:1-4,8)

దేవుని కార్యములు:
             యథార్థతనుబట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరచియున్నావు
            యాకోబు సంతతిమధ్య నీవు నీతి న్యాయములను జరిగించియున్నావు. (:4)
            వారు యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన వారి కుత్తరమిచ్చెను.
            మేఘస్తంభములోనుండి ఆయన వారితో మాట లాడెను.
             తన ప్రజలు అనుసరించుటకు శాసనములు, కట్టడలు యిచ్చెను (:6,7)
            వారిక్రియలను బట్టి ప్రతికారము చేయుచునే
            వారి విషయములో నీవు పాపము పరిహరించు దేవుడ వైతివి. (:8)

ఆత్మీయ అభ్యాసములు:
             యెహోవా రాజ్యము చేయుచున్నాడు జనములు వణకును (:1)
            భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించె దరు. (:3)
            మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి (:5)
            దేవునికి మొఱ్ఱపెట్టుట
           దేవుని శాసనములు, కట్టడలు అనుసరించుట (:7)



              

No comments:

Post a Comment