ప్రార్థన:
యెహోవా, నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము నీ మాటచొప్పున నీ రక్షణ రానిమ్ము.
అప్పుడు నన్ను నిందించువారికి నేను ఉత్తరమీయగలను
నా నోటనుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసి వేయకుము (:41-43)
ఆత్మీయ అభ్యాసములు:
నీమాట నమ్ముకొనియున్నాను.
నీ న్యాయవిధులమీద నా ఆశ నిలిపియున్నాను.
నిరంతరము నీ ధర్మశాస్త్రము ననుసరించుదును నేను నిత్యము దాని ననుసరించుదును
నేను నీ ఉపదేశములను వెదకువాడను నిర్బంధములేక నడుచుకొందును
సిగ్గుపడక రాజులయెదుట నీ శాసనములనుగూర్చి నేను మాటలాడెదను.
నీ ఆజ్ఞలనుబట్టి నేను హర్షించెదను అవి నాకు ప్రియములు.
నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞలతట్టు నా చేతు లెత్తెదను
నీ కట్టడలను నేను ధ్యానించుదును.(:42-48)
No comments:
Post a Comment