Sunday 22 May 2016

భూమ్యాకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది (కీర్తనలు 124)

దేవుని గూర్చిన వర్ణన:
భూమ్యాకాశములను సృజించిన యెహోవా (:8)

దేవుని కార్యములు:
దేవుడు మనకు తోడైయుండును (:1,2)
వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినొందును గాక.
పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరినుండి తప్పించుకొని యున్నది ఉరి తెంపబడెను మనము తప్పించుకొని యున్నాము.

భూమ్యాకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. (:6-8)


యెహోవా మనకు తోడైయుండనియెడల:
మనుష్యులు మనమీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడైయుండనియెడల
వారి ఆగ్రహము మనపైని రగులుకొనినప్పుడు
యెహోవా మనకు తోడైయుండనియెడల వారు మనలను ప్రాణముతోనే మింగివేసియుందురు
జలములు మనలను ముంచివేసి యుండును ప్రవాహము మన ప్రాణములమీదుగా పొర్లిపారి యుండును
ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణములమీదుగా పొర్లి పారియుండును (:2-5)


No comments:

Post a Comment