Thursday 30 June 2016

జ్ఞానముయొక్క పిలుపు (సామెతలు 8)

8:1
జ్ఞానము యొక్క పిలుపు 7వ అధ్యాయములోని జారస్త్రీ యొక్క పిలుపుకు విరుద్ధుమైనది.
జ్ఞానము మనకు మార్గదర్శినిగా (guide) (:1-13) విజయవంతమైన జీవితము ఇచ్చునదిగా (:14-21) వర్ణించబడింది. జ్ఞానము సృష్టి ఆరంభంలో ఉండి, సృష్టికర్తతో పనిచేసెను (:22-31). జ్ఞానముయొక్క ఉపదేశమును వినువారు ధన్యులు. (:32-35). జ్ఞానముయందు అసహ్యపడువారందరు మరణమును స్నేహించుదురు. (:36) ఆరంభమునుండి అంతమువరకు ఒకరి జీవితములోని ప్రతి కోణంలో జ్ఞానము ప్రభావితం కావాలి. దేవుని సూచన, నడిపింపు మీ జీవితములోని ప్రతి అంశంపై ఉండాలి.

8:13
ఒక వ్యక్తి దేవునిపట్ల ఎంతగా భయము, గౌరవం కలిగి ఉండునో అంతగా చెడుతనమును అసహ్యించుకుంటారు. దేవునిపట్ల ప్రేమ మరియు పాపము పట్ల ప్రేమ కలసి ఉండవు. రహస్యపాపములకు చోటివ్వడం నీలో చెడును పెంచిపోషించటమే. పాపముకు పూర్తిగా స్వస్తి పలికి,  దేవునికి నిన్నునీవు పూర్తిగా సమర్పించుకో.



No comments:

Post a Comment