9:1-5
ఈ అధ్యాయములో ఉదహరించబడిన విందునకు యేసు ప్రభువువారు తన ఉపమానములలో ఒకదానిలో ఉదాహరించిన విందనకు కొన్ని ఆసక్తికరమైన పోలికలు ఉన్నవి (లూకా 14:15-24). అనేకమంది వెళ్ళనుద్దేశిస్తారు కాని ఆ సమయంలో ముఖ్యమైనవిగా అనిపించే ఇతర కార్యకలాపాలవల్ల ప్రక్కత్రోవపడుతారు. దేవుని జ్ఞానము కొరకైన నీ అన్వేషణ కంటే మరేదీ ముఖ్యముకాకుండా ఉండాలి.
9:7-10
మీరు అపహాసకునిగా ఉన్నార లేక జ్ఞానముగల వ్యక్తిగావున్నారా అనునది గద్దింపుకు మీరు స్పందించు విధమువలన చెప్పవచ్చు. గద్దింపబడినప్పుడు తక్షణమే అణచివేయు విధముగా లేదా తెలివిగా (తప్పు నాదికాదు అన్నట్లుగా) బదులివ్వడంకంటే ఏమి చెబుతున్నారో వినాలి. మిమ్మును గద్దించువారినుండి (విమర్శకులు) నేర్చుకోవాలి; జ్ఞానానికి ఇదే మార్గం. జ్ఞానము, దేవుని ఎరుగుటతో ఆరంభమగును. ఆయన జీవమును కలుగజేసెను గనుక జీవితానికి కావలసిన జ్ఞానము ఆయన అనుగ్రహిస్తాడు. దేవుని ఎరుగుటకు ఆయనగూర్చిన వాత్సవాలు తెలుసుకోటమేగాక ఆయనతో వ్యక్తిగత సంబంధం కలిగిఉండాలి. నిజముగా జ్ఞానవంతమైన వ్యక్తిగా ఉండాలనుకుంటున్నారా? మరి అధికముగా దేవుని ఎరుగువారిగా ఉండండి. (జ్ఞానవంతులుగా ఉండుటకు మరి ఎక్కువ విషయాలు యాకోబు 1:5, 2పేతురు 1:2-4 లో చూడండి)
9:14-17
దుష్టత్వములో ఏదో మత్తు,మైకము ఉంది. ఒక పాపము మరొక పాపమునకు దారితీస్తుంది. క్రైస్తవ జీవితం కంటే పాపపు జీవితం ఉత్తేజకరముగా అనిపిస్తుంది. అందుకే దొంగిలించిన బుద్ధిహీనపు ఆహారము తినుటకు జ్ఞానము అందించు దివ్యమైన విందుకొరకైన తలంపులన్నీపక్కకు పెట్టేస్తారు. మోసపోకండి - పాపము ప్రమాదకరమైనది. నిషేధింపబడిన పండును తీసుకోకముందు, దానిని తిన్న వారికి ఏమిజరుగుతుందో దూరదృష్టితో ఆలోచించండి.

No comments:
Post a Comment