Saturday, 19 March 2016

దేవునిమాట వినుము, ఆయనకు భయపడుము (కీర్తనలు 85 నుండి ధ్యానము)

ఈ అద్భుతమైన కీర్తన, ఒకప్పుడు మనము మోసగాడైన యాకోబు సంతతివారమై, చెరలొ ఉండినవారమని గుర్తుచేయుచున్నది.
a)  యెహోవా, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి యున్నావు,  చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించియున్నావు. 
b)  నీ ప్రజల దోషమును పరిహరించియున్నావు వారి పాపమంతయు కప్పివేసి యున్నావు 
c)   నీ ఉగ్రత అంతయు మానివేసియున్నావు నీ కోపాగ్నిని చల్లార్చుకొని యున్నావు (:1-3)

8,9 వచనములు 
a) దేవుని మాట వినవలెను అని
b) మరల బుద్ధిహీనులు కాకుండవలెనని
c) ఆయనకు భయపడవలెను అని 
గుర్తుచేయుచున్నవి. 

10వ వచనము ప్రభువైన యేసు క్రీస్తు  సిలువవేయబడినప్పుడు జరిగిన విషయమును గుర్తుచేయుచున్నది.

కృపాసత్యములు కలిసికొనినవి నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దుపెట్టు కొనినవి.

దాని వలన కలుగు ఫలితము 11-13 వచనములు చెప్పుచున్నవి:

భూమిలోనుండి సత్యము మొలుచును ఆకాశములోనుండి నీతి పారజూచును.
యెహోవా ఉత్తమమైనదాని ననుగ్రహించును మన భూమి దాని ఫలమునిచ్చును.
నీతి ఆయనకు ముందు నడచును ఆయన అడుగుజాడలలో అది నడచును.

యేసు క్రీస్తు ప్రభువుయొక్క పరిశుద్ధ రక్తములొ కడుగబడిన ప్రతి వ్యక్తిలొ సత్యము, నీతి, ఫలవంతమైన జీవితము కనిపించును.

-- డేవిడ్ నల్లపు  (నువార్తికులు మరియు మిషనరి,  అగాపే మినిస్ట్రీస్-ఇంటర్నేష్నల్)









No comments:

Post a Comment