యాకోబు నివాసములన్నిటికంటె సీయోను గుమ్మ ములు యెహోవాకు ప్రియములై యున్నవి (:2)
సర్వోన్నతుడు తానే దాని స్థిరపరచెననియు సీయోనునుగూర్చి చెప్పుకొందురు. (:5)
సర్వోన్నతుడు తానే దాని స్థిరపరచెననియు సీయోనునుగూర్చి చెప్పుకొందురు. (:5)
ఈ కీర్తన, ప్రభువైన యేసు క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘముపై ఉన్న ప్రేమను గుర్తు చేయుచున్నది. ఆయనే ఆ సంఘమును స్థిరపరచునని తెలియజేయుచున్నది.
ప్రభువైన యేసు క్రీస్తు నిన్ను ప్రేమించుచున్నడని నీవు యెరిగితివా ? ఆయనను నీ జీవితములోనికి ఆహ్వానించుటద్వారా నీవును ఆయన సంఘమునందు ఒక భాగముగా ఉండి ఆయనచేత స్థిరపరచబడుదువు.
తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట, తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును. యుగయుగములకు ప్రభావమాయనకు కలుగునుగాక. ఆమేన్. (1 పేతురు 5:10,11)
- డేవిడ్ నల్లపు (సువార్తికులు,మిషనరీ - అగాపే మినిస్ట్రీస్ ఇంటర్నేష్నల్)
No comments:
Post a Comment