Wednesday 23 March 2016

యెడతెగని ప్రార్థన (కీర్తనలు 88 నుండి ధ్యానము)

ఈ కీర్తనలోని దేవుని ప్రత్యక్షత:
       రక్షణకర్తయగు దేవుడు (:1)
       అద్భుతములుచేయు దేవుడు.
       స్తుతింపదగిన దేవుడు (:10)
       కృపకలిగిన దేవుడు,
       విశ్వాస్యతగల దేవుడు (:11)
       నీతిమంతుడైన దేవుడు, (:12)

దేవుని చేతిలోనుండి తొలగిపోయినవారు వెళ్ళు స్థలము :
      సమాధి, నాశనకూపము, అంధకారము, పాతాళము (:11,12)

పాపము మనలను దేవునినుండి దూరముచేయును. ఫ్రభువైన యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును. నీవు ఆ పరిశుద్దమైన రక్తములో కడుగబడితివా?

కీర్తనాకారుని స్థితి:
       నేను ఆపదలతో నిండియున్నాను నా ప్రాణము పాతాళమునకు సమీపించియున్నది. (:3)
       అగాధమైన గుంటలోను చీకటిగల చోట్లలోను అగాధ జలములలోను నీవు నన్ను పరుండబెట్టి యున్నావు. (:6)
        నీ ఉగ్రత నామీద బరువుగా నున్నది నీ తరంగములన్నియు నన్ను ముంచుచున్నవి. (:7)
        నా నెళవరులను నాకు దూరముగా నీవు ఉంచి యున్నావు నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసియున్నావు.
       వెలుపలికి రావల్ల గాకుండ నేను బంధింపబడి యున్నాను (:8)
       బాధచేత నా కన్ను క్షీణించుచున్నది(:9)

కీర్తనాకారుని స్పందన:
ప్రతిదినము  రాత్రి, పగలు  దేవునికి మొఱ్ఱపెట్టుచు, ప్రార్థించుచూ ఆయనవైపు తన చేతులు చాపుతున్నడు (:1,9)

కీర్తనాకారుని ప్రార్థన:
యెహోవా, నీవు నన్ను విడుచుట యేల? నీ ముఖము నాకు చాటు చేయుట యేల? (:14)

దేవునితో నిత్యము సహవాసము మరియు ఆయనముఖదర్శనముకొరకు కీర్తనకారుడు తపించుచున్నవిదముగ మనమును ఉందుము గాక!


-   డేవిడ్ నల్లపు  (సువార్తికులు, మిషనరీ - అగాపే మినిస్ట్రీస్ ఇంటర్నేష్నల్)



     
       

No comments:

Post a Comment