దేవునిగూర్చిన వర్ణన :
భూలోక న్యాయాధిపతి, బలపరచు కృపగల దేవుడు, గొప్ప ఆదరణతో నెమ్మదికలుగజేయు దేవుడు, ఎత్తయిన కోట, ఆశ్రయదుర్గము. (:2, 18, 19, 22)
భక్తిహీనులు :
వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు దోషము చేయువారందరు బింకములాడు చున్నారు.
యెహోవా చూచుటలేదు యాకోబు దేవుడు విచారించుటలేదు అనుకొని యెహోవా, వారు నీ ప్రజలను నలుగగొట్టుచున్నారు నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు విధవరాండ్రను పరదేశులను చంపుచున్నారు తండ్రిలేనివారిని హతముచేయుచున్నారు. (:4-7)
అట్టివారు పశుప్రాయులు బుద్ధిహీనులు (:8)
భక్తిహీనులపై దేవుని చర్య:
ఆయన వారిదోషము వారిమీదికి రప్పించును వారి చెడుతనమునుబట్టి వారిని సంహరించును. మన దేవుడైన యెహోవా వారిని సంహరించును. (:23)
ప్రశ్నలు:
చెవులను కలుగచేసినవాడు వినకుండునా?
కంటిని నిర్మించినవాడు కానకుండునా?
అన్యుజనులను శిక్షించువాడు మనుష్యులకు తెలివి నేర్పువాడు దండింపకమానునా?
నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి యున్నది. (:9-11)
అవును, దేవునికి మనము పలుకు ప్రతిమాట, చేయు ప్రతి కార్యము, ప్రతి ఆలొచన తెలియును. ఆఅయన శిక్షించును, తెలివి నేర్పించును, దండించును.

యెహోవా, నీవు శిక్షించువాడు నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. (:12)
దేవుని వాగ్ధానములు:
నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు.
యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు.
విశ్వాసి అనుభవము:
నాకాలు జారెనని నేననుకొనగా యెహోవా, నీ కృప నన్ను బలపరచుచున్నది.
నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ జేయుచున్నది. (:18, 19)
యెహోవా నాకు ఎత్తయిన కోట నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము. (:22)
- డేవిడ్ నల్లపు(సువార్తికులు, మిసనరీ - అగాపే మినిస్ట్రీస్ ఇంటర్నేష్నల్)
No comments:
Post a Comment