Thursday 7 April 2016

నమ్మకస్థులైన వారిని నేను కనిపెట్టుచున్నాను (కీర్తనలు 101 నుండి ధ్యానము)

దేవునిగూర్చిన వర్ణన:
                 కృపగల దేవుడు, న్యాయవంతుడు, నిర్దోషి, వివేకముగల దేవుడు, యధార్థవంతుడు, నమ్మదగినదేవుడు (:1,2,6)

ఆత్మీయ అభ్యాసములు:   
                    నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను.
                    నా యింట యథార్థహృదయముతో నడుచుకొం దును
                   నా కన్నులయెదుట నేను ఏ దుష్కార్యమును ఉంచు కొనను
                   భక్తిమార్గము తొలగినవారి క్రియలు నాకు అసహ్య ములు అవి నాకు అంటనియ్యను (:2,3)
                   నాయొద్ద నివసించునట్లు దేశములో నమ్మకస్థులైన వారిని నేను కనిపెట్టుచున్నాను
                   నిర్దోషమార్గమందు నడచువారు నాకు పరిచారకు లగుదురు. (:6)

విశ్వాసి అసహ్యించుకొనవలసినవి:
                    మూర్ఖచిత్తుడు నా యొద్దనుండి తొలగిపోవలెను
                   దౌష్ట్యమును నేననుసరింపను.
                  తమ పొరుగువారిని చాటున దూషించువారిని నేను సంహరించెదను
                  అహంకార దృష్టిగలవారిని గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను
                 మోసము చేయువాడు నా యింట నివసింపరాదు
                 అబద్ధములాడువాడు నా కన్నులయెదుట నిలువడు. (:4-7)

దేవుని వాగ్ధానము:
              నాయొద్ద నివసించునట్లు దేశములో నమ్మకస్థులైన వారిని నేను కనిపెట్టుచున్నాను నిర్దోషమార్గమందు నడచువారు నాకు పరిచారకు లగుదురు. (:6)



No comments:

Post a Comment