Friday 8 April 2016

ఏకరీతిగానుండు దేవుడు (కీర్తనలు 102 నుండి ధ్యానము)

దేవునిగూర్చిన వర్ణన:
                    నిత్యము సింహాసనాసీనుడు, కరుణించుదేవుడు, దయచూపు దేవుడు, నిర్మాణకుడు, మహిమగల దేవుడు, ప్రార్థన ఆలకించు దేవుడు, విడిపించు దేవుడు, సృష్ఠికర్త, ఏకరీతిగానుండు దేవుడు,  స్థిరపరచు దేవుడు (:12,13,16,17,20,25,27,28)

కీర్తనాకారుని పోలిక:
            నేను అడవిలోని గూడబాతును పోలియున్నాను
           పాడైన స్థలములలోని పగిడికంటెవలె నున్నాను.
           రాత్రి మెలకువగా నుండి యింటిమీద ఒంటిగా నున్న పిచ్చుకవలె నున్నాను.  (:6,7)
           పొగ యెగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవు చున్నవి
          పొయిలోనిది కాలిపోయినట్లు నా యెముకలు కాలి పోయి యున్నవి.
          ఎండదెబ్బకు వాడిన గడ్డివలె నా హృదయము వాడి పోయి యున్నది  (:3,4)
          నా దినములు సాగిపోయిన నీడను పోలియున్నవి గడ్డివలె నేను వాడియున్నాను. (:11)

దేవుని వాగ్ధానములు:
                 యెహోవా సీయోనును కట్టియున్నాడు ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను
                 ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనవైపు తిరిగియున్నాడు.  (:16,17)
                 మనుష్యులు సీయోనులో యెహోవా నామఘనతను యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించు నట్లు
                చెరసాలలో ఉన్నవారి మూల్గులను వినుటకును
               చావునకు విధింపబడినవారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయమునుండి వంగి చూచెననియు ఆకాశమునుండి భూమిని దృష్టించెననియు... (:19-21)





No comments:

Post a Comment