Sunday 10 April 2016

దేవునికి ఇంపైన ధ్యానము (కీర్తనలు 104 నుండి ధ్యానము)

దేవునిగూర్చిన వర్ణన:
             అధిక ఘనతవహించిన దేవుడు, మహాత్మ్యమును ప్రభావమును ధరించియున్న దేవుడు, వెలుగు, సృష్టికర్త, జ్ఞానము మహిమగల దేవుడు (:1,2, 24,31)
 
దేవుని కార్యములు:
               యెహోవా, నా దేవా నీవు అధిక ఘనతవహించిన వాడవు నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించియున్నావు.
              వస్త్రమువలె వెలుగును నీవు కప్పుకొనియున్నావు. తెరను పరచినట్టు ఆకాశవిశాలమును నీవు పరచి యున్నావు.
              జలములలో ఆయన తన గదుల దూలములను వేసి యున్నాడు. మేఘములను తనకు వాహనముగా చేసికొని గాలి రెక్కలమీద గమనము చేయుచున్నాడు
              వాయువులను తనకు దూతలుగాను అగ్నిజ్వాలలను2 తనకు పరిచారకులుగాను ఆయన చేసి కొనియున్నాడు. (1-4)
             (ఇంక అనేకమైన దేవుని క్రియలు 5-32 వచనములలొ చూడగలము)
            యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి! జ్ఞానముచేత నీవు వాటన్నిటిని నిర్మించితివి నీవు కలుగజేసినవాటితో భూమి నిండియున్నది. (:24)


మంచి నిర్ణయము:
                 నా జీవితకాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను
                 నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను.
                ఆయననుగూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక
                 నేను యెహోవాయందు సంతోషించెదను. (:33,34)




         

         



No comments:

Post a Comment