Friday, 13 May 2016

నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది (కీర్తనలు 119:137-144 నుండి ధ్యానము)


దేవుని గూర్చిన వర్ణన:

 యెహోవా, నీవు నీతిమంతుడవు (:137)
నీ నీతి శాశ్వతమైనది(:142)


దేవుని వాక్యము:
నీ న్యాయవిధులు యథార్థములు (:137)
నీతినిబట్టియు పూర్ణ విశ్వాస్యతనుబట్టియు నీ శాసనములను నీవు నియమించితివి. (:138)
నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది (:140)
నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. (:142)
నీ శాసనములు శాశ్వతమైన నీతిగలవి  (:144)


ఆత్మీయ అభ్యాసములు:

నా విరోధులు నీ వాక్యములు మరచిపోవుదురు కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. (:139)
 నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది అది నీ సేవకునికి ప్రియమైనది. (:140)
నేను అల్పుడను నిరాకరింపబడినవాడను అయినను నీ ఉపదేశములను నేను మరువను. (:141)
శ్రమయు వేదనయు నన్ను పట్టియున్నవి అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయు చున్నవి (:143)



ప్రార్థన:
నేను బ్రదుకునట్లు నాకు తెలివి దయచేయుము.(:144)



No comments:

Post a Comment