Thursday, 5 May 2016

నీ కృప నన్ను ఆదరించును గాక (కీర్తనలు 119:73-80 నుండి ధ్యానము)

దేవుని గూర్చిన వర్ణన:
           నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను (:73)
           యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యతగలవాడవై నీవు నన్ను శ్రమపరచితివనియు నేనెరుగుదును.  (:75)
         

ప్రార్థన:
          నీ ఆజ్ఞలను నేర్చుకొనునట్లు నాకు బుద్ధి దయ చేయుము.  (:73)
          నీ సేవకునికి నీవిచ్చిన మాటచొప్పున నీ కృప నన్ను ఆదరించును గాక.
           నేను బ్రదుకునట్లు నీ కరుణాకటాక్షములు నాకు కలుగును గాక.
          గర్విష్ఠులు నామీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురు గాక.
          నీయందు భయభక్తులుగలవారును నీ శాసనములను తెలిసికొనువారును నా పక్షమున నుందురు గాక.
         నేను సిగ్గుపడకుండునట్లు నా హృదయము నీ కట్టడలవిషయమై నిర్దోషమగును గాక. (:76-80)


ఆత్మీయ అభ్యాసములు:
         నీ వాక్యముమీద నేను ఆశపెట్టుకొని యున్నాను నీయందు భయభక్తులుగలవారు నన్ను చూచి సంతో షింతురు (:74)
         నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము.  (:77)
         నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను. (:78)





No comments:

Post a Comment