Wednesday, 29 June 2016

జారస్త్రీనిగూర్చిన మరొక హెచ్చరిక (సామెతలు 7)

7:6-23
ఈ భాగము యువత అంతటికి వర్తిస్తుంది. జీవితానికి ఒక గురిలేని వ్యక్తి బుద్ధిహీనుడు. దిశ, గమ్యము లేని శూన్య జీవితము అస్థిరమైనది, అనేక శోధనలకు గురియగును. ఈ భాగములోని యువకునికి తన గమ్యం తెలియనప్పటికి, జారస్త్రీకి అతనిని నడిపించవలసిన స్థలము తెలుసు. ఆమె వ్యూహమును గమనించండి :
పురుషులను ఆకర్షించు వస్త్రధారణ కలిగిఉన్నది. (:10)
ఆమె విధానము ధైర్యముగా ఉన్నది. (:13)
అతనిని తన నివాసముకు ఆహ్వానిస్తుంది (:16-18)
అతని ప్రతి ఆక్షేపణకు నేర్పుగా  జవాబు ఇస్తుంది. (:19,20)
మృదువైన సంభాషణతో ఒప్పింపచేస్తోంది.(:21)
అతనికి వలపన్నుతుంది (trap చేస్తోంది) (:23)

శోధనపై విజముకొరకు నీ జీవితము దేవుని వాక్యముతో, దేవుని జ్ఞానముతో నిండి ఉండాలి.

శోధనల వ్యూహములను గుర్తించి, వాటి నుండి దూరముగా వేగిరముగా పరుగెత్తాలి.

7: 25-27
లైంగికపాపములను నివారించుటకు కచ్చితమైన నిర్ణాయాలు మీరు  తీసుకోవచ్చు:
1. మీ మనస్సును కాచుకోండి. తప్పుడు కోరికలను పురికొల్పు పుస్తకాలను చదవొద్దు, దృశ్యాలను చూడొద్దు, కల్పితగాధాలకు చోటివ్వొద్దు.
2. పాపముచేయుటకు నిన్ను శోధించు స్థలములకు, స్నేహితులకు దూరముగా ఉండుము.
౩. క్షనికానందం మీద కాకుండా భవిష్యత్తు మీద దృష్టి నిలుపుము. నేటి ఉద్వేగము రేపటి వినాశనముకు కారణం కావచ్చు.



.

No comments:

Post a Comment