Tuesday 10 May 2016

నా కేడెము నీవే (కీర్తనలు 119:113-120 నుండి ధ్యానము)

దేవునిగూర్చిన వర్ణన:
             నాకు మరుగుచోటు నా కేడెము నీవే (:114)
              నీ కట్టడలను మీరిన వారినందరిని నీవు నిరాకరించుదువు వారి కపటాలోచన మోసమే.
              భూమిమీదనున్న భక్తిహీనులనందరిని నీవు మష్టువలె లయపరచుదువు  (:118,119)
           

ఆత్మీయ అభ్యాసములు:
             ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము.
             నేను నీ వాక్యముమీద ఆశపెట్టుకొనియున్నాను.
             నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించెదను దుష్‌క్రియలు చేయువారలారా, నాయొద్దనుండి తొలగుడి. (:113-115)
             నీ శాసనములు నాకు ఇష్టమైయున్నవి (:119)
             నీ భయమువలన నా శరీరము వణకుచున్నది నీ న్యాయవిధులకు నేను భయపడుచున్నాను. (:120)


ప్రార్థన:
       
               నేను బ్రదుకునట్లు నీ మాటచొప్పున నన్ను ఆదు కొనుము నా ఆశ భంగమై నేను సిగ్గునొందక యుందును గాక. 
              నాకు రక్షణకలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసెదను. (:116,117)

             



No comments:

Post a Comment