Saturday, 7 May 2016

నేను నీవాడనే నన్ను రక్షించుము (కీర్తనలు 119:89-96 నుండి ధ్యానము)

దేవుని వాక్యము:
           యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా నున్నది. (:89)
           సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి యున్నాను నీ ధర్మోపదేశము అపరిమితమైనది. (:96)

దేవునిగూర్చిన వర్ణన మరియు ఆయన కార్యములు:
                        నీ విశ్వాస్యత తరతరములుండును. నీవు భూమిని స్థాపించితివి అది స్థిరముగానున్నది
                       సమస్తము నీకు సేవచేయుచున్నవి కావున నీ నిర్ణయముచొప్పున అవి నేటికిని స్థిరపడి యున్నవి (:90,91)

ఆత్మీయ అభ్యాసములు:
             నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యనియెడల నా శ్రమయందు నేను నశించియుందును.
           నీ ఉపదేశమువలన నీవు నన్ను బ్రదికించితివి నేనెన్నడును వాటిని మరువను. 
           నీ ఉపదేశములను నేను వెదకుచున్నాను 
           నన్ను సంహరింపవలెనని భక్తిహీనులు నా కొరకు పొంచియున్నారు అయితే నేను నీ శాసనములను తలపోయుచున్నాను. (:92,-95)

ప్రార్థన:
       నేను నీవాడనే నన్ను రక్షించుము. (:94)





 

No comments:

Post a Comment