Sunday 8 May 2016

తేనెకంటె తీపి (కీర్తనలు 119:97-104 నుండి ధ్యానము)

దేవునివాక్యమువలన కలుగు ఆశీర్వాదములు:
          నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా నున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగ జేయుచున్నవి.
       నా బోధకులందరికంటె నాకు విశేషజ్ఞానము కలదు.  (:98,99)
       వృద్ధులకంటె నాకు విశేషజ్ఞానము కలదు. (:100)
       నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనెకంటె తీపిగా నున్నవి.
       నీ ఉపదేశమువలన నాకు వివేకము కలిగెను తప్పుమార్గములన్నియు నా కసహ్యములాయెను. (:103,104)

ఆత్మీయ అభ్యాసములు:
           నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను (:97)
           నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను (:99)
           నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను
       నేను నీ వాక్యము ననుసరించునట్లు దుష్టమార్గములన్నిటిలోనుండి నా పాదములు తొల గించుకొనుచున్నాను 
          నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయవిధులనుండి నేను తొలగకయున్నాను. (:100-102)



No comments:

Post a Comment